విద్యాధర్ కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గామి. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. మనిషి స్వర్శ తెలియని వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇప్పటికే టీజర్,ట్రైలర్, పాటలను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పుడు సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. ఈసినిమా క్లీన్ యూ సర్టిఫికెట్ ను అందించారు సెన్సార్ సభ్యులు. అంతేకాదు సెన్సార్ సభ్యుల నుండి ఈసినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.
Join the 𝐀dventures of an 𝐀ghora in his pursuit of his touch ✨
Book your tickets now for 𝐀n experience of a lifetime 💥
🎟️ https://t.co/GPGN6SF5RL#Gaami Gr𝐀nd rele𝐀se worldwide on M𝐀rch 8th 🧿@VishwakSenActor @iChandiniC @KarthikSabaresh @nanivid @mgabhinaya… pic.twitter.com/Bq7um81lEg— UV Creations (@UV_Creations) March 5, 2024
కాగా ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: