గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుండి బ్యాడ్ సాంగ్ రిలీజ్

bad song out from gangs of godavari movie

యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈసినిమాలో విశ్వక్‌సేన్ లంకల రత్నగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. మే 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ మే 31వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ లో స్పీడు పెంచారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేసారు. వాటిలో సినిమాపై మరింత క్రేజ్ తెచ్చిన పాట సుట్టంలా సూసి పోకలా అనే పాట. ఇక ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. బ్యాడ్ సాంగ్ అంటూ వచ్చే ఈపాటను విడుదల చేశారు. అడవికి గొడ్డలి బ్యాడ్.. కడుపుకి అంబలి బ్యాడ్.. మట్టికి నాగలి బ్యాడ్ అంటూ వచ్చే ఈపాట ఆకట్టుకుంటుంది. ఇక ఈపాటకు కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. యువన్‌ శంకర్ రాజా ఆలపించారు.

కాగా ఈసినిమాలో నేహా శెట్టి  హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి,సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.