ఫ్యామిలీ స్టార్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ 

family star teaser gets good response

గీత గోవిందం తరువాత డైరెక్టర్ పరుశురాం,సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.ఇందులో విజయ్ మిడికల్ క్లాస్ కుర్రాడి గా కనిపించనున్నాడు.ఇక నిన్న ఈసినిమా  టీజర్ ను  వదిలారు.టీజర్ చూస్తే టైటిల్ కు తగ్గట్లే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.చివర్లో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ ,విజయ్ దేవరకొండ మధ్య వచ్చే సన్నివేశం టీజర్ కు హైలైట్ అయ్యింది.ఓవరాల్ గా టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.యూట్యూబ్ లో ఈ టీజర్ ఇప్పటివరకు 7మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.జస్ట్ హిట్ టాక్ వస్తే  చాలు ఈసినిమా విజయ్ కి మరో గీత గోవిందం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫ్యామిలీ స్టార్ ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ను జరుపుకుంటుంది.ఈసినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఏప్రిల్ 5న ఈసినిమా తెలుగు తోపాటు తమిళ,హిందీ భాషల్లో విడుదలకానుంది.

ఇక విజయ్ ప్రస్తుతం ఈసినిమాతో పాటు తన 12వ సినిమాలోకూడా నటిస్తున్నాడు.ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఫ్యామిలీ స్టార్ వల్ల ఈసినిమాకు బ్రేక్ ఇచ్చాడు విజయ్.అయితే ఏప్రిల్ నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోనుంది.జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను తెరకెక్కిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − two =