బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్, పలు పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది కానీ రిలీజ్ కాలేకపోయింది. ఈసందర్భంగా చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేస్తున్నామని.. సెన్సార్ సర్టిఫికేషన్ క్లియరెన్స్ లో ఆలస్యమవ్వడంతో రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నామని తెలిపారు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో రిలీజ్ తెలియచేస్తామని చెప్పారు.
కాగా ఈసినిమా లో వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈసినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ఎస్. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























