బౌండ్‌ స్క్రిప్ట్‌ ఉంటే, మెయిల్ చేయండి – నవీన్ పోలిశెట్టి

Naveen Polishetty Offers Movie Chance to A Netizen

టాలీవుడ్ లోని ట్యాలెంటెడ్ యంగ్ హీరోలలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన అతి తక్కువ కాలంలోనే ప్రతిభ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో పలు యూట్యూబ్ వీడియోలతో పాటు లఘు చిత్రాలలో నటించిన నవీన్ పోలిశెట్టి అనంతరం కొన్ని సినిమాలలో సైడ్ రోల్స్ లో కనిపించారు. 2019లో ‘చిచోర్’ అనే హిందీ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా మొదటి అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమా అద్భుత విజయం సాధించడంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. దీని తర్వాత వచ్చిన ‘జాతి రత్నాలు’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదే క్రమంలో గతేడాది స్టార్ హీరోయిన్ అనుష్క కథానాయికగా ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చేసిన నవీన్‌ పొలిశెట్టి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన నుంచి మరే సినిమా రాలేదు. కనీసం ఆయన చేయబోయే తదుపరి ప్రాజెక్టు ఏంటనేదానిపై కూడా ఇంతవరకూ క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఒక నెటిజెన్ ఆయన ట్యాలెంట్ గురించి ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా.. దానిపై నవీన్ స్పందించారు. ఇండియాలో ప్రస్తుతమున్న నటుల్లో నవీన్ గ్రేట్ ఆర్టిస్ట్ అని నెటిజెన్ పేర్కొనగా.. అందుకు నవీన్ పోలిశెట్టి బదులిచ్చారు. మంచి కథ ఉంటే చెప్పండి, మూవీ చేద్దాం అని సదరు నెటిజెన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

నవీన్ పోలిశెట్టి ఎక్స్ వేదికగా.. “చాలా థ్యాంక్స్. ప్రస్తుతం నా రాబోయే చిత్రాలన్నీ స్క్రిప్ట్ దశలో ఉన్నందున నేను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేను. దయచేసి ఓపికపట్టండి. అత్యుత్తమ నాణ్యత గల న్యూ జెనరేషన్ కథలను మీకు అందించడానికి సమయం పడుతుంది. అలాగే మీరు బౌండ్ స్క్రిప్ట్‌లతో రచయిత అయితే, నా బయోలోని ఇ మెయిల్ చిరునామాకు మెయిల్ చేయండి. లవ్ ఏ బ్లడీ సినిమా” అని రిప్లై ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగా.. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటించనున్న క్రేజీ ప్రాజెక్టు ‘రామాయణ్’లో నవీన్ లక్ష్మణుడు పాత్రను పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 14 =