సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమా పుష్ప2. ఈసినిమా పుష్ప సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పార్ట్ 2 పై హై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుకే సుకుమార్ కాస్త టైమ్ తీసుకొని పార్ట్ 2కోసం సాలిడ్ కథను రాసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆవీడియోకు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో కూడా చూశాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా గురించి పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నసంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. రెగ్యులర్ గా పెద్ద యాక్షన్ సీక్వెన్స్ తో ముగిసినట్టు కాకుండా ఈసినిమాలో హృదయానికి హత్తుకునే ఎమోషనల్ సాంగ్ తో ఇంటర్వెల్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారట సుకుమార్. చిన్న ఫైట్ సీక్వెన్స్ తరువాత వచ్చే ఈ సాంగ్ అందరి మనసులు తాకడంతో పాటు సెకండ్ హాఫ్ పై మంచి ఇంట్రెస్ట్ ని ఏర్పరుస్తుందని అంటున్నారు.
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: