ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా లాల్ సలామ్. ఈసినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ఓ క్రికెట్ మ్యాచ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసిన తీరు, తర్వాత వాటి వల్ల ఓ గ్రామం ఎదుర్కొన్న సంఘర్షణ ఆధారంగా ఈసినిమాను రూపొందించారు. ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా నిరాశనే మిగిల్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికరమైన విషయం ఒకటి వినిపిస్తుంది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా ఈసినిమా మార్చి ఎండింగ్ లో అలా రిలీజ్ చేద్దామనుకున్నారట. కానీ ఇప్పుడు కాస్త ముందుగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మార్చి సెకండ్ వీక్ లో లేదాా మార్చి 2వ తేదీన రిలీజ్ చేయాలని చూస్తున్నారట. చూద్దాం మరి థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈసినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో.
కాగా ఈసినిమాలో జీవిత రాజశేఖర్ కూడా ఒక కీలక పాత్రలో నటించారు. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఒక కీలకపాత్రలో నటించారు. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: