అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన కామెడీ ప్లస్ హార్రర్ మూవీ ‘గీతాంజలి’ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈసీక్వెల్ రానుంది. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ రిలీడ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఈసినిమా టీజర్ ను ఫిబ్రవరి 24వ తేదీన సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీజర్ ను బేగంపేట శ్మశానన వాటికలో రిలీజ్ చేస్తున్నట్టు తెలియచేశారు.
ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ⚰️ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ 🥶👻
Brace Yourselves for a Never Before Event In Telugu Cinema ❄️🔥#GeethanjaliMalliVachindhi #Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati @Plakkaraju pic.twitter.com/deM4OUsiXP
— Kona Film Corporation (@KonaFilmCorp) February 22, 2024
కాగా ఈసినిమాలో ఇంకా మలయాళ నటుడు రాహుల్ మాధవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్లో సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు రాహుల్. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: