న్యాచురల్ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు నాని. అందులో దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించగా.. హాయ్ నాన్న డీసెంట్ హిట్ ను అందించింది. ఇక ఈ ఏడాది అప్పుడే పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం అయితే సరిపోదా శనివారం అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్-ప్యాక్డ్ సినిమాగా ఈసినిమా రాబోతుంది. ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఈ శనివారం అంటే ఫిబ్రవరి24వ తేదీన స్పెషల్ ట్రీట్ ను ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే డేట్ ను చెప్పారు కానీ టైమ్ ను మాత్రం చెప్పలేదు. ఇప్పుడు తాజాగా టైమ్ ను కూడా ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 11గంటల 59 నిమిషాలకు నానిలోని ఫల్ మాస్ ను చూపించనున్నట్టు తెలిపారు.
Shadows can’t hide the Mass Hysteria inside…
WANNA SEE HIM?
Get ready for an explosion this Saturday at 11:59 AM 💥#SaripodhaaSanivaaram
Natural 🌟 @NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe @muraligdop @karthikaSriniva @IamKalyanDasari @DVVMovies… pic.twitter.com/cYTvTNyjBK
— DVV Entertainment (@DVVMovies) February 21, 2024
కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: