స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య ఎంగేజ్‌మెంట్, ఫోటోలు వైరల్

Tamil Filmmaker Shankar's Daughter Aishwarya Engaged with Assistant Director Tharun Karthikeyan

కోలీవుడ్ స్టార్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే త్వరలోనే ఆయన ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యా శంకర్ వివాహం మరికొన్ని రోజుల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐశ్వర్య నిశ్చితార్థం తరుణ్ కార్తికేయతో ఘనంగా జరిగింది. ఆదివారం (ఫిబ్రవరి 18, 2024) చెన్నైలో జరిగిన ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు శంకర్ సన్నిహితుల మిత్రులు కొంతమంది హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వరుడు తరుణ్ కార్తికేయ దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తరుణ్‌ కార్తికేయన్‌ కేవలం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా పాటల రచయితగానూ, అలాగే ప్లే బ్యాక్‌ సింగర్‌గా కూడా కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలోనే ఐశ్వర్య శంకర్, తరుణ్ కార్తీక్ వివాహం జరుగనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఐశ్వర్య సోదరి మరియు నటి అదితి శంకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వేడుకకు సంబంధించిన కొన్ని అందమైన చిత్రాలను పంచుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Aditi Shankar (@aditishankarofficial)

కాగా ఐశ్వర్యకు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఇంతకుముందు ఆమె రాష్ట్ర స్థాయి క్రికెటర్ మరియు ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు రోహిత్ దామోదరన్‌ను జూన్ 2021లో వివాహం చేసుకున్నారు. మహాబలిపురంలోని రిసార్ట్‌లో గ్రాండ్‌గా జరిగిన ఈ వెడ్డింగ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ పెళ్లి జరిగిన కొద్దికాలంలోనే వీరు విడాకులు తీసుకున్నారు. రోహిత్‌ దామోదరన్‌ నిర్వహిస్తున్న క్రికెట్‌ కోచింగ్‌ సెంటర్‌లో మహిళా ఆటగాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారనే ఫిర్యాదులు రావడంతో.. కోచ్ తామరై కన్నన్‌ సహా రోహిత్‌పై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =