నా ఫేవరెట్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్

prabhas and ntr are my favorite heroes says cricketer shami

మన తెలుగు హీరోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరును సంపాదించుకుంటున్న సంగతి తెలిసిందే కదా. బాహుబలి తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియచేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఆ మార్క్ ను మరింత స్ట్రాంగ్ గా నిలబెట్టారు. అంతేకాదు అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా ప్రపంచ నలుమూలల వరకూవెళ్లింది. దీంతో మన హీరోల రేంజ్ తో పాటు ఫ్యాన్స్ బేస్ కూడా పెరిగిపోయింది. ఇక ఇక్కడ ఓ క్రికెటర్ కూడా తమ ఫేవరెట్ హీరోలు ఎవరంటే మన హీరోల పేర్లు చెబుతున్నాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు వరల్డ్ కప్ లో తమ బౌలింగ్ తో మార్క్ ను క్రియేట్ చేసిన షమి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమినీ ఫేవరెట్ హీరో ఎవరని అడుగగా అందుకు ప్రభాస్, ఎన్టీఆర్ తన అభిమాన హీరోలని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రభాస్, ఎన్టీఆర్ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ రీసెంట్ గానే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం తన కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తుండగా.. సందీప్ వంగాతో స్పిరిట్ సినిమా లైన్లో ఉంది. ఇంకా ప్రశాంత్ నీల్ తో సలార్ 2 పట్టాలెక్కాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇంకా వార్ 2 సినిమా ఒకటి లైన్ లో ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =