రివ్యూ : ఊరు పేరు భైరవకోన 

Ooru Peru Bhairavakona Movie Telugu Review

నటీనటులు : సందీప్ కిషన్,వర్ష బొల్లమ్మ,కావ్య థాపర్
ఎడిటింగ్ : చోట కె ప్రసాద్
సినిమాటోగ్రఫీ : రాజ్ తోట
సంగీతం : శేఖర్ చంద్ర
దర్శకత్వం : వి ఐ ఆనంద్
నిర్మాత : రాజేష్ దండా

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టైగర్ తరువాత యంగ్ హీరో సందీప్ కిషన్ ,డైరెక్టర్ వి ఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఊరు పేరు భైరవకోన.ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని తీసుకొచ్చింది.ముఖ్యంగా సాంగ్స్ చార్ట్ బాస్టర్ అయ్యాయి.ఇక సినిమా మీద వున్న నమ్మకంతో రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్లు వేశారు.ఈ షో ల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.మరి ఈసినిమా ఎలా వుంది? ఇంతకీ భైరవకోన కథేంటి? ఈసినిమా అయినా సందీప్ కిషన్ కు హిట్ ఇచ్చిందా లేదో ఇప్పుడు చూద్దాం.

కథ : 
బసవ( సందీప్ కిషన్) అతని స్నేహితుడు జాన్ (వైవా హర్ష) ఓ దొంగతనం చేసి భైరవకోన అనే ఊరిలోకి ప్రవేశిస్తారు.వీరితో పాటు గీత (కావ్య థాపర్) కూడా ఆ ఊరిలోకి వస్తుంది.ఇక అక్కడి నుండి ఈ ముగ్గురికి ఎలాంటి సవాళ్లు ఎదురయయ్యాయి.ఇంతకీ  భైరవకోనకి మిగతా ఊర్లకి ఉండే తేడా ఏమిటి? గరుడ పురాణంలో మిస్ అయిన నాలుగు పేజీల్లో భైరవకోన గురించి ఏం వుంది.అసలు బసవ ఎందుకు దొంగగా మారాల్సి వచ్చింది.ఇంతకీ భూమి (వర్ష బొల్లమ్మ) ఎవరు అనేదే మిగితా కథ.

విశ్లేషణ : 

భైరవకోన అనే కల్పితమైన ఊరు ను సృష్టించి దానికి గరుడపురాణాన్ని లింక్ చేసి ఓ ఫాంటసీ థ్రిల్లర్ ను రెడీ చేసుకున్నాడు దర్శకుడు వి ఐ ఆనంద్.ఇక దాన్ని అంతే థ్రిల్లింగ్ గా తెర మీదకు తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.అయితే ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవ్వడం కొన్నికొన్ని సన్నివేశాలు లాజిక్ దూరంగా ఉండడం కొంచెం మైనస్ అయ్యాయి.ఇవి తప్ప మిగితా అంతా ఎంగేజింగ్ గా వుంది.

కథలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా సింపుల్ గా భైరవకోనను ప్రేక్షకుడికి కనెక్ట్ చేశాడు దర్శకుడు.ఇక అక్కడి నుండి సినిమా వావ్ అనిపిస్తుంది.ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.వైవా హర్ష ,వెన్నల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి.వీటికి తోడు ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుండడం తో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరుగుతాయి.

ఇక సెకండ్ హాఫ్ లో లాజిక్ దూరంగా వుండే  కొన్ని సన్నివేశాలు తప్పా మిగితా అంత ఎంగేజ్ చేస్తుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ అయ్యాయి.నిజమేనే చెబుతున్నా సాంగ్ తెర మీద కూడా  చాలా బాగుంది.ఓవరాల్ గా భైరవకోన లో ఫస్ట్ హాఫ్ సూపర్ అనేలా ఉండగా సెకండ్ హాఫ్ డీసెంట్ అనేలా వుంది.

నటీనటులవిషయానికి వస్తే బసవ పాత్రలో సందీప్ అదరగొట్టాడు.సహజంగా నటించి తెర మీద బసవ మాత్రమే కనిపించేలా చేశాడు.హీరోయిన్లు గా నటించిన వర్ష బొల్లమ్మ ,కావ్య థాపర్ లకు ఎక్కువ సేపే స్క్రీన్ షేర్ చేసుకున్నారు.వీరిద్దరి నటన మెప్పిస్తుంది.ఇక వైవా హర్షకు మంచి పాత్ర దక్కింది.హర్షతో కలిసి వెన్నెల కిషోర్ చాలా చోట్ల నవ్వించాడు.

టెక్నికల్ గా కూడా సినిమా ఉన్నతంగా వుంది.శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కథకు తగ్గట్లు గా వుంది.రాజ్ తోట కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది.విజువల్స్ బాగున్నాయి.ఎడిటింగ్ ఓకే.నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.మీడియం బడ్జెట్ లో మంచి క్వాలిటీ వున్న సినిమాను నిర్మించారు.

ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన ఊరు పేరు భైరవకోన ఆకట్టుకుందని చెప్పొచ్చు.ఫస్ట్ హాఫ్ సూపర్ అనేలా ఉండగా సెకండ్ హాఫ్ డీసెంట్ అనిపించుకుంది.సందీప్ నటన,కామెడీ ,సాంగ్స్ సినిమాలో హైలెట్ అయ్యాయి.ఓమంచి ఫాంటసీ థ్రిల్లర్ ను చూడాలనుకుంటే ఈ భైరవకోనను చూడొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 10 =