కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో హర్షచెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా సుందరం మాస్టర్. ఓ గిరిజిన ప్రాంతానికి ఇంగ్లీష్ టీచర్ గా వెళ్లిన సుందరం అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అన్నదే ఈసినిమా కథ. ఈ సినిమా ఫిబ్రవరి 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే కామెడీ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాను రవితేజ టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్‌కుమార్ కుర్రు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. మరి చూద్దాం ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: