గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్‌లో ఆల్ టైం హిట్స్‌లో ఒకటిగా నిలిచిన మూవీ ‘సమరసింహారెడ్డి’. 1999లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. విడుదలైన అన్ని ఏరియాల్లో రికార్డుల మోత మోగించి అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. బాలకృష్ణ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్‌తో చాలా థియేటర్లు రీ మోడలింగ్ చేయించుకున్నాయంటే ఏ రేంజ్ హిట్టో అర్ధం చేసుకోవచ్చు. తెలుగునాట ఫ్యాక్షన్ జానర్ చిత్రాలకు నాందిగా నిలిచింది, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది ఈ సినిమానే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ కల్ట్ యాక్షన్ మూవీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 2న ప్రపంచవ్యాప్తంగా సమరసింహారెడ్డి థియేటర్లలోకి రాబోతోంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాగా తెలుగు రాష్ట్రాలలో డిజిటల్ మీడియా రంగంలో నెం.1గా ఉన్న మ్యాంగో మాస్ మీడియా సమరసింహారెడ్డి చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తుండటం గమనార్హం. రీ మాస్టర్ చేసిన ప్రింట్‌తో పాటు 7.1 డాల్బీ సౌండ్‌లో థియేటర్లలో రీ సౌండ్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. కాగా సమరసింహారెడ్డి రీ రిలీజ్ అవుతుందని తెలిసి బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. థియేటర్లలో మరోసారి తమ అభిమాన హీరో కల్ట్ మూవీని వీక్షించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram
సమరసింహారెడ్డిలో బాలకృష్ణ నట విశ్వరూపం చూసి నందమూరి అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం అచ్చెరువొందారు. ఫస్ట్‌హాఫ్‌లో అబ్బులు పాత్రలో కామెడీ, ఎమోషన్స్ పండించిన విధానం.. సెకండాఫ్‌లో రాయలసీమ ప్రాంతంలోని ఫ్యాక్షన్ లీడర్‌గా బాలయ్య వీరవిహారం సినిమాను సూపర్ డూపర్ హిట్ అయ్యేలా చేసాయి. దర్శకుడు బి. గోపాల్ తెరకెక్కించిన విధానం, ఇక హీరోయిన్స్ సిమ్రాన్, అంజలా ఝవేరిల గ్లామర్‌కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం తోడవడంతో ఈ మూవీ సంచలన విజయం సాధించింది. శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చెంగల వెంకట్రావు ఈ మూవీలో నిర్మించిన జయప్రకాశ్ రెడ్డి, పృథ్వీరాజ్, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలలో నటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: