సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా ‘సూరరై పోట్రు’ . డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా సూరారై పోట్రు తెరకెక్కింది. కరోనా వల్ల ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అయినా కూడా ఈసినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈసినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో కూడా ఆకాశం నీ హద్దురా టైటిల్ తో రిలీజ్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను హిందీ లో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు. ఎప్పుడో ఈసినిమాను ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. అయితే ఆ మధ్య ఈసినిమా రిలీజ్ పై కూడా పలు వార్తలు వచ్చాయి. ఈరీమేక్ ను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అన్నారు. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. చాలా కాలం తరువాత ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. తాజాాగా ఈసినిమా టైటిల్ ను అలానే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఈసినిమాకు సర్ఫిరా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అంతేేకాదు ఈసినిమాను జులై 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Dream so Big, they call you Crazy!#Sarfira releasing only in cinemas on 12th July, 2024. #MaarUdi@akshaykumar #RadhikaMadan @SirPareshRawal @Sudha_Kongara #Jyotika @Suriya_offl @vikramix @rajsekarpandian @vbfilmwala @Abundantia_Ent #CapeOfGoodFilms @CaptGopinath @gvprakash… pic.twitter.com/kkdDiml4u3
— 2D Entertainment (@2D_ENTPVTLTD) February 13, 2024
కాగా ఈసినిమాలో రాధిక మదన్ హీరోయిన్ నటిస్తుండగా పరేష్ రావల్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ ఇంకా 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై అరుణా భాటియా, విక్రమ్ మల్హోత్రా, సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: