మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది చిత్రయూనిట్. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టికెట్టే కొనకుండా అనే పాటను అలానే రాధిక అనే పాటను రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా ట్రైలర్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీంతో అందరూ ఈ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ క్యూరియాసిటీని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాట్రైలర్ రెడీ అవుతుంది అంటూ ట్రైలర్ కట్ చేస్తున్న ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ ఎలక్ట్రిఫయింగ్ ట్రైలర్ రెడీ అవుతుంది గెట్ రెడీ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
An Electrifying Trailer of #TilluSquare is getting READY!! 🤩🕺
MADness to be unleashed on 14th February! 😎
Stay tuned guys! 🥳#Siddu @anupamahere @MallikRam99 @musicthaman @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts… pic.twitter.com/8vP8lPvcXw
— Sithara Entertainments (@SitharaEnts) February 12, 2024
కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: