మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం నటులు రఘుబాబు మరియు శివబాలాజీలతో కలిసి డిప్యూటీ సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి చిత్ర పరిశ్రమ తరుపున బహుమతిని అందజేశారు. అనంతరం ఈ భేటీ గురించి విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అందులో.. “తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నో విషయాల మీద చర్చించాం. తెలుగు చిత్ర పరిశ్రమ తరుపున డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడాం. డ్రగ్స్ ఫ్రీ సొసైటి కోసం ప్రయత్నిస్తున్న ఇలాంటి ప్రభుత్వంతో మేమంతా ఐకమత్యంగా కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నాం” అని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Honored to meet Telangana Deputy Chief Minister Shri @Bhatti_Mallu garu. Discussed plans for a joint campaign against drugs on behalf of the Telugu film industry. We stand united with the state government in this crucial fight. Together, let’s build a drug-free society! 🎬🤝… pic.twitter.com/iwmz9ca5h8
— Vishnu Manchu (@iVishnuManchu) February 5, 2024
కాగా విష్ణు మంచు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మహాభారత్’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తుండగా.. దేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం నటిస్తోంది. దీనిలో భాగంగా మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్, ప్రీతి ముకుందన్.. శాండల్ వుడ్ నుంచి శివ రాజ్‌కుమార్, కోలీవుడ్ నుంచి నయనతార, శరత్ కుమార్ వంటి అగ్ర నటీనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇంకా విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సైతం మరో కీ రోల్‌ను పోషిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో మంచు ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ విష్ణు తనయుడు అవ్రామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంకా పలువురు స్టార్లు ఈసినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఒకప్పటి టాలీవుడ్ క్లాసిక్ అయిన భక్త కన్నప్పకు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే యేడాది పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భాషలలో గ్రాండ్‍గా రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: