#90’S డైరెక్టర్ కు క్రేజీ ఆఫర్లు

aditya hasan gets huge offers

రీసెంట్ గా వచ్చిన #90’S అనే వెబ్ సిరీస్ సూపర్ అనిపించుకుంది.మిడిల్ క్లాస్ బయోపిక్ గా వచ్చిన ఈసిరీస్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది.దాంతో యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటిటి లో స్ట్రీమింగ్ లో వుంది.ఇక ఈవెబ్ సిరీస్ ను రియలిస్టిక్ గా తెరకెక్కించి మంచి మార్కులు కొట్టేశాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్.ఓ మధ్య తరగతి కుటుంభం లైఫ్ స్టైల్ ను కళ్లకు కట్టినట్టు చూపించాడు.ఈ వెబ్ సిరీస్ ఈ డైరెక్టర్ కు ఇప్పుడు సినిమా ఆఫర్లు కూడా తీసుకొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆదిత్య హాసన్ కు రెండు ప్రామిసింగ్ బ్యానర్ల లో అవకాశాలు వచ్చాయి.అందులో ఒకటి హీరో నితిన్ తో సినిమా చేయనున్నాడు.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని ఆదిత్య హాసన్ తెలిపాడు.నితిన్ ప్రస్తుతం తమ్ముడు,రాబిన్ హుడ్ అనే సినిమాలు చేస్తున్నాడు. ఆతరువాత ఆదిత్యతో సినిమా చేయనున్నాడు.శ్రేష్ట్ మూవీస్ ఈ సినిమాను నిర్మించనుంది.

ఇక ఆదిత్య తన రెండో సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా చేయనున్నాడు.నాగవంశీ,  ఆదిత్యకు ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడట.అయితే ఎలాంటి సినిమా చేయాలి హీరో ఎవరు అనేది డిసైడ్ చేసుకోలేదట.ఈవిషయాలను రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో ఆదిత్య హాసన్  చెప్పాడు.మొత్తానికి ఒక్క వెబ్ సిరీస్ తో ఆదిత్య హాసన్ సాలిడ్ ఆఫర్లు ను పట్టేశాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =