టాలీవుడ్‌లోని గ్రేట్ కమెడియన్స్‌లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తొలివరుసలో ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో నెం.1 కమెడియన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ఇటీవలి కాలంలో బ్రహ్మానందం సినిమాలలో నటించడం తగ్గించారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం మీమ్స్ రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. దాదాపు 1500 సినిమాల్లో నటించిన ఆయన గిన్నిస్ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంత చేసుకున్న ఆయన తాజాగా మరో ఘనత సాధించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్రహ్మానందం సినిమా కెరీర్‌లో తొలిసారిగా ఒక నేపాలీ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు-నేపాలీ భాషల్లో తెరకెక్కుతోంది. ఈరోజు బ్రహ్మానందం జన్మదినం సందర్భంగా.. ఈ సినిమా నుంచి బ్రహ్మానందం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీ టైటిల్ మరియుఅలాగే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. దీనికి ‘హ్రశ్వ దీర్ఘ’ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీని ప్రకారం హ్రశ్వ దీర్ఘ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నారు. ఇక బ్రహ్మానందం జన్మదినం సందర్భంగా అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
హరిహర అధికారి, నీతా దుంగన ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. బ్రహ్మానందం, ప్రదీప్ రావత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నీతా ఫిలిం ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి చంద్ర పంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హరిహర అధికారి ఈ మూవీకి కథను అందించండం విశేషం. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘హ్రశ్వ దీర్ఘ’ సినిమా తెలుగు, నేపాలీ భాషల్లో రిలీజ్ కానుంది. బ్రహ్మానందం మొదటిసారి నటిస్తున్న నేపాలీ చిత్రం కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: