నా సామిరంగ సంక్రాంతికి రిలీజ్ అంటే.. పిచ్చెక్కిందా అన్నారు – నాగార్జున అక్కినేని

Naa Saami Ranga Success Celebrations: Nagarjuna Presents Mementos To Movie Team

టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు ప్రసంశలు అందుకొని సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా అలరిస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది. ఈ వేడుకలో కింగ్ నాగార్జున చేతులు మీదగా చిత్ర యూనిట్ కి సక్సెస్ షీల్డ్స్ ని అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో నాగార్జున అక్కినేని మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. అన్ కండీషనల్ లవ్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్ కి, తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా మీరు ఎప్పుడూ ప్రేమని పంచుతూనే వుంటారు. నేను కనిపించగానే ఆనందంతో నవ్వుతూవుంటారు. వారి చిరునవ్వే నాకు ధైర్యం. ఎంతో పాజిటివ్ గా ఉంటూ మాకు థియేటర్స్, రిలీజ్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థాంక్స్. మా యూనిట్ ని ప్రతి క్షణం మిస్ అవుతున్నాను. ఈ సినిమా ప్రయాణం చాలా అద్భుతంగా జరిగింది. అందరూ ఎంతో ప్రేమతో పని చేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునమా థాంక్స్ చెప్పడం కాదు.. ప్రతిఒక్కరినీ చాలా మిస్ అవుతున్నాను. ఈ వండర్ ఫుల్ ఫీలింగ్ ఇచ్చిన అందరికీ థాంక్స్” అని చెప్పారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సెప్టెంబర్ 20 నాన్నగారి పుట్టిన రోజున విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత అదే రోజున ఈ సినిమా మొదలుపెట్టాం. సినిమా ఓపెనింగ్ జరుగుతుందని మా ఫ్యామిలీ ఎవరికీ తెలీదు. షూటింగ్ కి బయలుదేరుతుంటే ఎక్కడికని అమల అడిగింది. ‘సినిమా మొదలుపెట్టాలి, వెళ్ళాలి’ అన్నాను. ‘సాయంత్రం వెళ్ళొచ్చు కదా’ అంటే.. ”సంక్రాంతికి విడుదల చేయాలి. త్వరగా వెళ్ళాలి’ అన్నాను. అప్పుడు అందరూ నన్ను బిత్తరమొహాలు వేసుకొని చూశారు (నవ్వుతూ). ‘సంక్రాంతి విడుదల అంటున్నారు, ఏమైనా పిచ్చెక్కిందా’ అని పిల్లలతో సహా అందరూ అన్నారు” అని తెలిపారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు.. “సినిమా మొదలుపెట్టిన తర్వాత సంక్రాంతి వస్తుందనే నమ్మకం బయట ఎవరి మొహాల్లో లేదు. కానీ నా టీం మొహాల్లో మాత్రం ఆ నమ్మకం వుంది. మా నమ్మకం నిజమైయింది. విజయవంతంగా విడుదల చేశాం. అనుకున్న సమయానికి పూర్తి కావడానికి కీరవాణి గారు ఒక ప్రధాన కారణం. ఆయన ఒక టైం టేబుల్ వేసి మా అందరినీ ప్రోత్సహించారు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కీరవాణి గారికి ధన్యవాదాలు. చంద్రబోస్ గారు చక్కని పాటలు రాశారు. టీం లో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చాలా పాజిటివ్ గా మా గురించి రాసిన మీడియా మిత్రులందరికీ థాంక్స్. సీ యూ నెక్స్ట్ సంక్రాంతి” అని నాగార్జున అక్కినేని పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =