నటుడు వేణుకి పితృ వియోగం

actor venu thottempudi father passed away

టాలీవుడ్ లో మరో హీరోకు పిృతివియోగం కలిగింది. ఆ హీరో ఎవరో కాదు ఎన్నో సినిమాతో అలరించిన వేణు తొట్టెంపూడి. వేణు తండ్రి తొట్టెంపూడి వెంకట సుబ్బారావు నేడు తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సుబ్బారావు గత కొద్ది రోజులుగా బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో నేడు పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో వేణుకి సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియచేస్తున్నారు. ఆయన భౌతికకాయాన్ని శ్రీనగర్ కాలనీలోని స్టీల్ అండ్ మైన్స్ కాంప్లెక్స్ వద్ద సందర్శనార్థం ఉంచుతున్నారు. జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘స్వయంవరం’ చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నాడు. ఇక ఆ తరువాత `హనుమాన్‌ జంక్షన్‌`, `అల్లరే అల్లరి`,`గోపి గోపిక గోదావరి`, ‘చెప్పవే చిరుగాలి’, ‘కళ్యాణ రాముడు’, ‘పెళ్లాం ఊరెళ్తే’, ‘ఖుషిఖుషిగా’ వంటి చిత్రాలతో తన కామెడీ నటనతో ఆకట్టుకున్నాడు వేణు. అయితే ఆ తరువాత సరైన విజయాలు లేక సినిమాలకు దూరమయ్యారు. 2012లో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన `దమ్ము` చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించాడు. 2013 తర్వాత ఆయన ఏ సినిమాలో కనిపించలేదు. చాలా గ్యాప్ తరువాత రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రీఎంట్రీ ఇచ్చారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 2 =