VD12 షూటింగ్ పై నాగవంశీ క్లారిటీ

producer naga vamsi clarity on VD12 movie shooting

టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఖుషి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్న విజయ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమా వస్తుంది. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు విజయ్‌ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టారు. అంతేకాదు ఈసినిమా అనౌన్స్ మెంట్ అప్పుడే VD12 అనే ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు పలు కామెంట్లు వచ్చాయి. అయితే ఈసినిమా షూటింగ్ పై ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. ఈమధ్య అయితే ఈసినిమా ఆగిపోయిందన్న వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా సినిమా నిర్మాత అయిన నాగవంశీ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ స్టార్ షూటింగ్ అయిపోయిన తరువాత VD12 మూవీ షూట్ మళ్లీ మొదలవుతుందని స్పష్టం చేశారు.

కాగా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ దేవరకొండ స్పై గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.  ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.