భారీ హైప్ తో రిలీజ్ అయి బోల్తా కొట్టే సినిమాలు కొన్ని ఉంటాయి.. అలానే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లను అందుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా ఈ సంక్రాంతికి వచ్చిన సినిమానే హనుమాన్. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో ఫైనల్ గా సంక్రాంతికి పండుగ సందర్బంగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేశారు. ఇక అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం కూడా రిలీజ్ అయింది. అయితే రిలీజ్ కు ముందే చాలా కంపారిజన్స్ వచ్చాయి. కానీ అలాంటివి ఏం పట్టించుకోకుండా సినిమాను రిలీజ్ చేశారు హనుమాన్ మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫైనల్ గావారి నమ్మకానికి తగిన రిజల్ట్ ను అయితే సొంతం చేసుకున్నారు. ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అంతేకాదు ప్రీమియర్ షోల నుంచే మొదలైన ఈ సినిమా హడావిడి.. క్రమంగా పెరుగుతూనే ఉంది. రోజు రోజుకీ కలెక్షన్స్ ను పెంచుకుంటూ వెళుతుంది. ఇక యూఎస్ లో కూడా ఈసినిమా ప్రభంజనం నడుస్తుంది. కేవలం నార్త్ అమెరికాలోనే నాలుగు రోజుల్లో 3 మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. దీంతో ఉత్తర అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాల జాబితాలో హనుమాన్ చేరింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్నీ రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
#Hanuman Creates History! Breached $3 Million mark in North America. It is now Top 10 highest grossing Telugu film in North America.#HanumanCreatesHistory #HanuMania #HanuManEverywhere @Primeshowtweets @tejasajja123 @PrasanthVarma @Niran_Reddy pic.twitter.com/ym5fzMW7mw
— Nirvana Cinemas (@NirvanaCinemas) January 16, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: