యూఎస్ బాక్సాఫీస్ వద్ద హనుమాన్ ప్రభంజనం

teja sajja hanuman movie usa collections update

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్. ఈసినిమా రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న అంటే జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ ను అందించింది. ప్రశాంత్ వర్మ మేకింగ్, తేజ సజ్జా యాక్టింగ్, విఎఫ్ఎక్స్, సంగీతంకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మంచి రివ్యూలు, విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా రిలీజ్ కు ముందే అడ్వాన్స్ సేల్స్ లో తన సత్తా చూపించింది. ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ఏ లో కూడా సాలిడ్ ప్రీ సేల్స్ ను అందుకుంది. మరి సినిమా రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. దీంతో ఆ ప్రభావం కలెక్షన్స్ పై స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ప్రీమియర్స్ కే హాఫ్ మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన ఈసినిమా ఇప్పుడు ఏకంగా 1 మిలియన్ డాలర్స్ మార్క్ దిశగా దూసుకెళ్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా యూఎస్ లో 8 లక్షల డాలర్స్ గ్రాస్ ని క్రాస్ చేసినట్టుగా యూఎస్ డిస్ట్రిబ్యూటర్ అయిన నిర్వాణ సినిమాస్ వారు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ముందు ముందు ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉందంటున్నారు.

కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈసినిమాకు సంగీతం.. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్, సినిమాటోగ్రఫీ: శివేంద్ర అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =