రోషన్ బబుల్ గమ్ రివ్యూ

roshans bubble gum movie review

బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా బబుల్ గమ్. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమాపై మొదటినుండీ మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. రోషన్, మానస చౌదరి, హర్ష వర్ధన్, అను హాసన్ తదితరులు
డైరెక్టర్..రవికాంత్ పేరెపు
బ్యానర్స్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సినిమాటోగ్రఫి.. సురేష్ రగుతు
సంగీతం..శ్రీచరణ్ పాకాల

కథ..

ఆది (రోషన్ కనకాల) చిన్నప్పటినుండీ డీజే అవ్వాలని కలలు కంటూ కంటాడు. అలా తనకి వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ జీవనాన్ని సాగిస్తుంటాడు. అలా సాగుతున్న క్రమంలో ఓ పబ్‌లో జాను (మానస చౌదరి) ని చూస్తాడు. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే జాను మాత్రం ప్రేమ, పెళ్లి అంటే పెద్దగా ఒపీనియన్ లేని అమ్మాయి. అయితే టైంపాస్ కోసమని ఆదితో మాట్లాడుతుంది. ఇక ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. ఆ జర్నీలో జాను నిజంగానే ఆదిని ప్రేమిస్తుంది. అయితే ఒక సంఘటన వల్ల ఇద్దరూ విడిపోతారు. మరి వీరిద్దరూ చివరికి ఎలా కలిశారు..?డీజే అవ్వాలన్న ఆది కల నెరవేరిందా? లేదా?అన్నది ఈసినిమా కథ..

విశ్లేషణ
ఇండస్ట్రీకి వారసులు ఎంట్రీ ఇవ్వడం కామన్. ఇప్పటికే ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు మరో వారసుడు కూడా ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ యాంకర్, రాజీవ్ తనయుడిగా రోషన్ చిన్నప్పటినుండే అందిరికీ సుపరిచితుడు. తాతయ్య నుండి నాన్న వరకూ సినీ నేపథ్యమే.. అందులోనూ తాతకు ఏకంగా యాక్టింగ్ స్కూలే ఉంది. అలాంటి నేపథ్యంలో వచ్చిన రోషన్ కు హీరో కావాలని ఉండటం సహజమే. ఆ కోరికతోనే బబుల్ గమ్ సినిమాతో అరంగేట్రం చేశాడు.

నిజానికి ఈకథలో కొత్త పాయింట్ ఏం లేదు. యూత్ ఫుల్ లవ్ స్టోరీతోనే వచ్చారు. అయితే రవికాంత్ పేరేపు తెరకెక్కించిన విధానం కొత్తగా ఉంది. ప్రేమ‌, పెళ్లి, బ్రేక‌ప్ వంటి విష‌యాల్లో నేటి యువ‌త ఏ విధంగా ఆలోచిస్తున్నారన్నది ఈ సినిమాలో చూపించాడు డైరెక్ట‌ర్‌. అయితే నేటి యూత్ కు తగ్గట్టుగా కాస్త ఆడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉంది. టేకింగ్ పరంగా దర్శకుడిగా మంచి మార్కులే పడతాయి.

ఒంటిపై బ‌ట్ట‌లు లేకుండా కేవ‌లం డ్రాయ‌ర్‌తోనే హీరో క‌నిపించే సీన్‌తోనే ఆస‌క్తిక‌రంగా ఈ సినిమా ప్రారంభ‌మంవుతుంది. తండ్రితో తిట్లు తింటూ డీజేగా మార‌డానికి హీరో చేసే ప్ర‌య‌త్నాల ఆరంభంలో కామెడీని పంచుతాయి. హీరోను హీరోయిన్ అవ‌మానించే సీన్‌…ఆ త‌ర్వాత త‌న త‌ప్పును తెలుసుకునే సీన్‌తోనే సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు డైరెక్ట‌ర్‌. ప్రేమ కోసం హీరో పెట్టిన కండీష‌న్స్‌కు హీరోయిన్ ఒప్పుకోవ‌డం, రిచ్ అమ్మాయి అయిన త‌ను మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేయ‌డానికి హీరో ఇంట్లోనే ఉండ‌టం అనే డ్రామాతో సెకండాఫ్‌ను న‌డిపించాడు.

పెర్ఫామెన్స్
ఇక ఈసినిమాకు మెయిన్ హైలెట్ రోషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టీజర్, ట్రైలర్ లతోనే మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు రోషన్. సినిమాలో కూడా అదే రేంజ్ లో నటించాడు. మొదటి సినిమా అనే ఫీలింగే అనిపించదు రోషన్ యాక్టింగ్ చూస్తుంటే. హీరోయిన్ గా నటించిన మానస చౌదరి కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. మరో కీలక పాత్రల్లో నటించిన హర్ష వర్ధన్, అను హాసన్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం
ఈసినిమాకు సాంకేతిక విభాగం కూడా బాగానే కలిసొచ్చింది. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం బాగానే ఆకట్టుకుంది. రిలీజ్ కు ముందే పాటలు బాగా ఆకట్టుకున్నాయి. దానితో పాటు నేపథ్య సంగీతం కూడా బాగా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సురేష్ రగుతు వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే అందరూ కలిసి చూసే సినిమా అని చెప్పలేం కానీ ఈసినిమా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడం కొంచం కష్టం..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 12 =