పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాలున్న ఈ చిత్రం దానికి తగ్గట్లే భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. ప్రభాస్ కటౌట్‌కి సరిగ్గా సరిపోయే సినిమా ఇదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. ప్రభాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ కలగలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా.. సలార్ మూవీ యూనిట్ అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ అందించింది. తాజాగా ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీన్‌కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసింది. ‘దేవుళ్ళు ఎలాగో రారు అన్నావుగా.. అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా అంటూ’.. ప్రభాస్‌ను ఎలివేట్ చేసేలా ఉన్న ఈ ప్రోమో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ముఖ్యంగా ఈ సన్నివేశంలో కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ అందించిన బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక సినిమాలో అయితే ఈ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు ఎవరూ సీట్లలో కూర్చునే పరిస్థితి ఉండదు. విలన్లను ప్రభాస్ ఊచకోత కోస్తుంటే.. సగటు ప్రేక్షకుడు సంభ్రమాశ్చర్యాలతో అలా చూస్తుండిపోతాడంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది.
కాగా సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. శాండల్‌వుడ్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో కనిపించరు. అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, బాబి సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు భువన్ గౌడ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై ‘కె.జి.యఫ్’, ‘కాంతారా’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందించిన విజయ్ కిరగందూర్ గ్రాండ్‌గా నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: