సలార్ పై సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

sudheer babu praises on prabhas salaar movie

మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. వాళ్లు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమాలో ప్రభాస్ మాస్ జాతరను చూపించాడు. అంతేకాదు తమ హీరోను ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో అలా ఈసినిమాలో ఉండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రభాస్ యాక్టింగ్, మాస్ అవతార్, యాక్షన్ సీక్వెన్స్, ప్రశాంత్ నీల్ మేకింగ్ అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తాజాగా యంగ్ హీరో సుధీర్ బాబు కూడా తన సోషల్ మీడియా ద్వారా స్పందించి టీమ్ ను అభినందించారు. యాక్షన్ లో సలార్ బ్లాక్ బస్టర్.. ప్రభాస్ పవర్ హౌస్ పెర్ఫామెన్స్ ను చూపించాడు.. ఇంకా తనలోని స్టార్ పవర్ అలానే వర్సిటాలిటీని మరోసారి చూపించాడు. ప్రశాంత్ నీల్ కు ఖుదోస్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

కాగా సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. పృథ్విరాజ్ సుకుమారన్‌, జగపతిబాబు, బాబి సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌, పృథ్విరాజ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. . హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =