సైంధవ్- హార్ట్ టచింగ్ బుజ్జి కొండవే సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

SAINDHAV 3rd Single BujjiKondave song release date fixed

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమా సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. జనవరి 13వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రాంగ్ యూసేజ్ అనే పాట, సరద సరదాగా అనే పాటలను రిలీజ్ చేశారు. ఇప్పుడు మూడో పాటతో రానున్నారు. బుజ్జి కొండవే అంటూ హార్ట్ టచింగ్ సాంగ్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ నేడు తెలియచేశారు. ఈ పాటను డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.

కాగా ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − thirteen =