టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ పేరు ముందే ఉంటుంది. చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకూ కాస్త డిటెక్టివ్ తరహా సినిమాలే చేసిన అడివి శేష్.. ఈసినిమాతో లవ్ కథతో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ రీసెంట్ గానే ఇచ్చారు. ఇప్పటికే ఈసినిమా నుండి ప్రీ లుక్ లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ లుక్ ఇంకా టైటిల్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా. ఇక చెప్పినట్టే నేడు ఈసినిమా టైటిల్ టీజర్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈసినిమాకు డెకాయిట్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The most anticipated #SeshEXShruti is #DACOIT 🔥🔥
A story of trust and betrayal. A saga of love and loss ❤️🔥
Title Teaser out now 💥
– https://t.co/bCLx79MWtkShoot begins!@AdiviSesh @shrutihaasan @Deonidas #SupriyaYarlagadda @AnnapurnaStdios #SSCreations pic.twitter.com/6XBS0fzbza
— Suniel Narang (@AsianSuniel) December 20, 2023
కాగా ఈసినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: