మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా

Ram Charan, Upasana and Klin Kaara Visits Mumbai Mahalakshmi Temple

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ గతవారం సతీసమేతంగా ముంబైకి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు (డిసెంబర్ 20, 2023)) తన భార్య ఉపాసన కొణిదెల మరియు కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఇక్కడి ప్రముఖ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. కాగా మెగా ఫ్యాన్స్ క్లిన్ కారాను ‘మెగా లిటిల్ ప్రిన్సెస్’గా పిలుచుకుంటుంటారన్న సంగతి తెలిసిందే. చరణ్‌-ఉపాసన దంపతుల ముద్దుల తనయ క్లిన్ కారా జన్మించి నేటికి సరిగ్గా 6 నెలలు అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారు నేడు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. కుమార్తె క్లిన్ కారా కోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మహాలక్ష్మి ఆలయం వద్ద రామ్‌ చరణ్‌తో ఫోటోలు దిగడానికి అభిమానులు ఆసక్తి కనబరిచారు. అయితే ఈ సందర్భంగా క్లిన్ కారా ముఖం బయటకి కనపడకుండా చరణ్‌ దంపతులు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అందులో క్లిన్ కారా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఇక చరణ్, ఉపాసనల నిశ్చితార్థం 2011, డిసెంబర్ 11న జరుగగా.. 2012, జూన్ 14న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దంపతులకు ఈ ఏడాది జూన్ 20న పాప క్లిన్ కారా జన్మించిన విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, ఎస్‌జె సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. కాగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + nine =