టాలీవుడ్లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు పేరు ముందుంటుంది. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటికే దిల్ రాజు సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇటీవలే దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో మరో బ్యానర్ ను కూడా పెట్టిన సంగతి విదితమే. చిన్న సినిమాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ బ్యానర్ ను పెట్టాడు దిల్ రాజు. ఇక పెట్టినట్టే ముందుగా బలగం అనే సినిమాను తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈసినిమా జాతీయంగా కాదు ఏకంగా అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ బ్యానర్ లో కూడా వరుసగా సినిమాలను నిర్మించే పనిలో పడ్డాడు దిల్ రాజు. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ బ్యానర్ లో రాబోతున్న నాలుగో సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. సుహాస్ హీరోగా ఈ నాలుగో సినిమా రాబోతుంది. నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ప్రశాంత్ నీల్ క్లాప్ కొట్టగా.. కెమెరా స్విచ్ ను అనిల్ రావిపూడి ఆన్ చేయగా.. వేణు ఫస్ట్ షాట్ ను డైరెక్ట్ చేశారు. కాగా ఈసినిమాలో సంగీర్తన హీరయిన్ గా నటిస్తుండగా మిగిలిన నటీనటులు.. ఇతర సాంకేతిక నిపుణుల వివరాల గురించి త్వరలో తెలియచేయనున్నారు.
A fun court drama backed by family emotion ❤️🔥#DRP4 with #Suhas was launched with a grand Pooja ceremony 🪔 https://t.co/ZQQqz56cXm
🎬 by #PrashanthNeel
🎥 switch-on by @AnilRavipudi
First shot directed by @venuYeldandi9 @ActorSuhas @sangeerthanaluv pic.twitter.com/PKwTQjw9aL— Dil Raju Productions (@DilRajuProdctns) December 19, 2023
ఇక సుహాస్ ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మహా వెంకటేష్ అలానే గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్ని వాసు ఇంకా ధీరజ్ మొగిలినేని కలిసి సంయుక్తంగా నిరిస్తున్నారు. ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: