ప్రశాంత్ నీల్ ను కెజియఫ్ ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ ను చేసింది.ఏకంగా రాజమౌళి తో కంపేర్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు.తన మేకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది.ఎక్కువ కలర్ ఫుల్ విజువల్స్ ,భారీ విఎఫ్ఎక్స్ లు ఇవేవీ వుండవు.సినిమా అంతా డార్క్ షేడ్ లో ఉంటుంది.తన మొదటి సినిమా ఉగ్రం నుండి ఇప్పటి సలార్ దాకా అదే ఫార్మాట్ లో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో డార్క్ షేడ్ లోనే ఎందుకు తీస్తున్నాడో రివీల్ చేశాడు ప్రశాంత్ నీల్. తనకి ఎక్కువ కలర్స్ ఉంటే అసలు నచ్చదంట అదొక ఓసీడీ అని అందుకే తన మెంటాల్టీని ప్రతిభింబించేలా తన సీన్స్ కలర్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.ఇక సలార్ విషయానికి వస్తే ఈసినిమా కూడా డార్క్ షేడ్ తోనే వస్తుంది.90శాతం షూటింగ్ పైన తెలుగు రాష్ట్రాల్లోనే చేసేశారు.ఓ భారీ సెట్ లోనే సినిమాను కానిచ్చేశారు.
ఈ సినిమా ఈనెల 22న ఈసినిమా థియేటర్లలోకి వస్తుంది.రిలీజ్ ట్రైలర్ సినిమా ఫై అంచనాలను భారీగా పెంచేసింది.మొదటి రోజే 200కోట్లు కొల్లగొట్టేలా వుంది.ప్రభాస్ ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా చూపించనున్నాడు నీల్.ఎలివేషన్ ఇవ్వడం లో నీల్ తరువాతే ఎవరైనా.దాంతో ప్రభాస్ ఎలివేషన్ షాట్స్ ఎలా వుంటాయో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈసినిమా రెండు పార్టులు గా రానుంది.మొదటి భాగం సలార్ సీజ్ ఫైర్ ను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు.మరి భారీ అంచనాలతో వస్తున్న ఈసినిమా ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: