సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. ఇక ఇప్పుడు మరో వారసుడు టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తున్నాడు. అతను ఎవరో కాదు టాలీవుడ్ టాప్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు నౌకరి. 1996 లో కొల్లాపూర్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఈసినిమా రిలీజ్ డేట్ ను రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను కొత్త ఎడాది సందర్భంగా 2024 జనవరి 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్ అలానే పాటలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది.
A challenging journey of a Government Servant👨⚕️ in the stubborn society to bring a change!🏥
Watch the Trailer of #SarkaaruNoukari now on @telugufilmnagar 🎥🔗 https://t.co/lBSLwGiQOJ#SarkaaruNoukariOnJan1st@Ragavendraraoba @ShekarPhotos @AkashGoparaju98 @BVazhapandal… pic.twitter.com/C241r2G3fr
— Telugu FilmNagar (@telugufilmnagar) December 20, 2023
కాగా ఈసినిమాను లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావు ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాశ్‌కు జోడీగా భావనా వళపండల్ నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ ఇతర పాత్రల్లో కనిపించనుననారు. శాండిల్య సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కూడా గంగనమోని శేఖర్ పనిచేస్తుండటం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: