హనుమాన్ తెలుగులో కన్నా హిందీ లోనే ఎక్కువగా 

hanuman will be released in 1500 theaters in hindi

సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీ పడుతుంది హనుమాన్.స్టార్ కాస్ట్ లేకున్నా కంటెంట్ మీద వున్న నమ్మకంతో  వెనక్కి తగ్గడం లేదు.పైగా సంక్రాంతికి బరిలో నిలిచిన సినిమాల కన్నా ముందుగానే జనవరి 12న  వస్తున్నామని అనౌన్స్ చేసుకున్నారు.ఇక ఈసినిమాకు తెలుగులో కన్నా హిందీలో ఎక్కువ  థియేటర్లు దొరికాయి.హిందీలో 1500 థియేటర్లలో విడుదలవుతుండగా తెలుగులో 400 థియేటర్లు దొరికాయి. అదే రోజు మహేష్ బాబు గుంటూరు కారం విడుదలవుతుండడం తో థియేటర్ల సంఖ్య తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లను గుంటూరు కారం హోల్డ్ చేయనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు హనుమాన్ ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ లో  విఎఫ్ఎక్స్ ,బిజియం హైలైట్ అయ్యాయి.ట్రైలర్ చూస్తే  లిమిటెడ్ బడ్జెట్ లో క్వాలిటీ  సినిమా తీసినట్లు వుంది. ఈ విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ తో సినిమా ఫై అంచనాలు  పెరిగిపోయాయి.థియేట్రికల్ బిజినెస్ కూడా సాలిడ్ గా జరిగింది.అంతేకాదు ఈసినిమా ఏకంగా 10భాషల్లో విడుదలవుతుంది. అందులో భాగంగా  ఇంగ్లీష్ తోపాటు స్పానిష్ ,జపనీస్ ,చైనీస్,కొరియన్ భాషల్లో విడుదలచేస్తున్నారు.

తేజా సజ్జా  హీరోగా నటించిన ఈసినిమాలో అమ్రితా అయ్యర్ హీరోయిన్ గా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈసినిమాను ప్రైమ్ టైం షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై నిరంజన్ రెడ్డి నిర్మించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =