మాస్ మహారాజా రవితేజ హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక తాజాగా ఈసినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్. అంతేకాదు టైటిల్ ను కూడా ప్రకటించారు. ‘మిస్టర్ బచ్చన్’ అనే పవర్ టైటిల్ ఖరారు చేశారు.నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. రవితేజ పాత స్కూటర్‌పై షేడ్స్‌తో స్టైల్‌గా కూర్చుని కనిపిస్తున్నారు. అతని వెనుక నటరాజ్ థియేటర్, అమితాబ్ బచ్చన్ ఇమేజ్ చూడవచ్చు బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే కదా. మరి ఈసినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమానిగా కనిపిస్తాడా అన్నది చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా అతిధుల సమక్షంలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. హీరో రవితేజ, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, రఘు రామకృష్ణ స్క్రిప్ట్‌ను దర్శకుడు హరీష్ శంకర్‌కి అందజేశారు. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు కుమార్ మంగత్ పాఠక్ క్లాప్ కొట్టగా, కె రఘు రామకృష్ణ, టిజి భరత్ కలిసి కెమెరా స్విచాన్ చేసారు. ముహూర్తం షాట్‌కు వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
#MrBachchan takes off with an auspicious pooja ceremony ❤️#MassReunion shoot begins this month 💥
MassMaharaaj @RaviTeja_offl @harish2you @vishwaprasadtg @peoplemediafcy @TSeries @PanoramaMovies @vivekkuchibotla @KumarMangat #BhushanKumar @AbhishekPathakk #BhagyashriBorse… pic.twitter.com/6FtA6AKZh4
— People Media Factory (@peoplemediafcy) December 17, 2023
కాగా ఈసినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: