సర్కారు నౌకరి నుండి ‘నీ పసుపు పాదాలే తగిలి’ లిరికల్ సాంగ్ రిలీజ్

Nee Pasupu Paadaale Lyrical Video Out From Sarkaaru Noukari Movie

టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు ‘సర్కారు నౌకరి’ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆర్కే టెలీషో ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. శాండిల్య పీసపాటి సంగీతం అందిస్తున్నారు. సర్కారు నౌకరి సినిమాలో హీరో ఆకాష్ గోపరాజుతో పాటుగా భావనా వేదపండళ్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన టీజర్, లిరికల్ సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్దిరోజుల కిందట విడుదలైన మూవీ ఫస్ట్ లుక్ కూడా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే మూవీ ప్రమోషనల్ సాంగ్ కు విశేష స్పందన వచ్చింది. ఈ పాటను సింగర్ సునీత, హారిక నారాయణ్ మరియు సాహితీ చాగంటితో కలిసి ఆలపించడం విశేషం. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న ‘సర్కారు నౌకరి’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (డిసెంబర్ 17, 2023) ఈ సినిమా నుంచి మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ‘నీ పసుపు పాదాలే తగిలి గడప పూసెనా.. నీ ఎరుపు సిగ్గుల్లో ఎలిగి మెరిసినా’ అంటూ సాగే అద్భుతమైన మెలోడీ పాటను విడుదల చేశారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. కీర్తన, శాండిల్య ఆలపించారు. కాగా ఈ పాటలో హీరో, హీరోయిన్లు ఇరువురూ కొత్తగా పెళ్లైన జంటగా కనిపించారు. ఇక పాటలో ఇద్దరిమధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది.

కాగా ‘సర్కారు నౌకరి’ సినిమాలో రమ్య పొందూరి, తనికెళ్ల భరణి, సూర్య మరియు సత్య సాయి శ్రీనివాస్ వడ్లమాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1996వ సంవత్సరంలో కొల్లాపూర్‌లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ మూవీ సోషల్ డ్రామాగా, ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందుతోంది. ఇక హీరో ఆకాష్‌కు ఇది మొదటి సినిమా కావడం, అందులోనూ సింగర్ సునీత తనయుడు కావడంతో చిత్రంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆకాష్ రూపంలో మరో ప్రామిసింగ్ హీరో దొరికాడని ఇప్పటికే పలువురు అభిప్రాయపడిన నేపథ్యంలో ‘సర్కారు నౌకరి’పై మంచి బజ్ క్రియేట్ అయింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =