రామ్‌గోపాల్ వర్మ.. పేరుకి తెలుగు డైరెక్టర్ అయినా.. బాలీవుడ్‌లో కూడా సత్తా చూపిన దర్శకుడు. గతంలో ‘రంగీలా’, ‘సత్య’, ‘సర్కార్’ వంటి ఎన్నో కల్ట్ సినిమాలను తీసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆయన తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమకాలీన రాజకీయ పరిస్థితులపై దృష్టి పెట్టిన ఆయన వరుసగా ఈ నేపథ్యంలోనే సినిమాలు తీస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో.. ‘పవర్ స్టార్’, ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ మరియు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లాంటి సినిమాలను రామ్ గోపాల్ వర్మ తీసిన సంగతి గుర్తుండే ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ఏపీ సీఏం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒకే పోస్టర్ ద్వారా వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో మొదటి భాగం ‘వ్యూహం’ సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ చిక్కులు తొలగిపోయాయి. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యూ’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ఎక్స్ లో పోస్టు చేశారు. అందులో ‘బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గాయ్స్’ అంటూ తనదైన శైలిలో పోస్టు పెట్టారు. అయితే సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా సినిమాలో ఏమైనా మార్పులు చేశారా? లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఈ క్రమంలో వ్యూహం సినిమాను డిసెంబర్ 29న విడుదల చేయనున్నట్లు కూడా వర్మ ప్రకటించారు.
BAD NEWS for BAD GUYS 💪
VYUHAM censor CERTIFICATE 🙌
DECEMBER 29 th in THEATRES 😌 pic.twitter.com/LBBKAt977s
— Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2023
ఇక ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి పాత్రలు ఉంటాయని ఇప్పటికే ఆర్జీవీ ప్రకటించిన నేపథ్యంలో చిత్రంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనికితోడు గత కొన్ని రోజుల క్రితం ఈ సినిమాపై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేయగా దీనిపై వివాదం నెలకొంది. వ్యూహంలోని పాత్రలు రియల్ లైఫ్ వ్యక్తులను పోలి ఉండడం, అలాగే ఆయా పాత్రల పేర్లు కూడా అవే ఉండడంతో బోర్డు సభ్యులు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అప్పటినుంచి ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ సర్టిఫికెట్ లభించలేదు. అయితే వర్మ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న బోర్డు సినిమాకు ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా ఈ సినిమాల ద్వారా రామ్‌గోపాల్ వర్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏర్పడ్డ పరిస్థితులు మరియు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చోటుచేసుకున్న ప్రధాన సంఘటనల ఆధారంగా, వైఎస్ జగన్ రాజకీయ శక్తిగా ఎదగడం వంటి కొన్ని కీలక ఘట్టాలను చూపించనున్నారు. కాగా ఈ సినిమాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. అలాగే ఆయన సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రాధా కృషన్ యాక్ట్ చేస్తున్నారు. కాగా మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వర్మ ఇలా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ చిత్రాలను రిలీజ్ చేయనుండటంతో ఆసక్తికరంగా మారింది. కాగా ఈ రెండు సినిమాలను రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: