త్వరలో రానున్న కెప్టెన్ మిల్లర్ ట్రైలర్

dhanush captain miller movie trailer update

రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ఈసినిమా పొంగల్ రేసులో రానున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ గురించి. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ట్రైలర్ అప్ డేట్ ఇచ్చాడు ధనుష్. ఈసినిమా ట్రైలర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, ఆర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈసినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − nine =