జూ.ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని ఉంది – యానిమల్ నటి త్రిప్తి డిమ్రీ

Animal Actress Tripti Dimri Expresses Her Interest to Act with Jr NTR

త్రిప్తి డిమ్రీ.. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగుతోన్న పేరు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ అమ్మడి గురించే చర్చ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్‌ కపూర్‌, క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘యానిమల్’ ద్వారా ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, త్రిప్తి డిమ్రీ ఒక కీలక పాత్రలో నటించింది. ముఖ్యంగా ఇందులో రణ్‍బీర్‌తో కలిసి కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించిన త్రిప్తి డిమ్రీ.. కుర్రకారును ఆకట్టుకుని మరో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. కాగా బాలీవుడ్‌లో ఇంతకుముందు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించిన త్రిప్తి డిమ్రీ 2017లో వచ్చిన పోస్టర్ బాయ్స్ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. అనంతరం 2018లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘లైలా మజ్ను’లో ప్రధాన పాత్రలో నటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలోనే సందీప్ వంగా ‘యానిమల్’లో ఛాన్స్ కొట్టేసిన త్రిప్తి డిమ్రీ ‘జోయా’ పాత్రలో తన బోల్డ్ నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న త్రిప్తికి ప్రస్తుతం ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అలాగే ఇటీవలే ఐఎండీబీ (ఇండియన్ మూవీ డేటాబేస్) రిలీజ్ చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా సౌత్ ఇండస్ట్రీ నుంచి అవకాశం వస్తే ఎవరితో నటించాలనుకుంటున్నారు? అని యాంకర్ ప్రశ్నించగా.. టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని ఉందని త్రిప్తి బదులిచ్చింది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై తారక్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దేవర’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కాగా ‘జనతా గ్యారేజ్’ సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికితోడు.. వరల్డ్‌వైడ్‌ బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా ‘దేవర’పై అంతటా ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ సంస్థతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్​పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా.. సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా మొదటి పార్టు వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ రిలీజ్ కానుంది. మరోవైపు ఈ సినిమా తర్వాత తారక్ ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించనున్నారు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఒక భారీ చిత్రం చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + eleven =