వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో రవితేజ నటించిన ఈగల్ సినిమా కూడా ఒకటి ఉంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అయితే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలను బట్టి రవితేజ మేకోవర్ కు మాత్రం మంచి స్పందన వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా.. ఈసినిమా రిలీజ్ డేట్ పై పలు వార్తలు తెరపైకి వచ్చాయి. ఈసినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంటున్నట్టు కథనాలు మొదలయ్యాయి. అయితే ఈవార్తలపై చిత్రయూనిట్ త్వరగానే స్పందించింది. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. సినిమా ఎట్టి పరిస్థితుల్లో జనవరి 13నే విడుదల అవుతుంది అంటూ రిలీజ్ డేట్ పెట్టి కన్ఫామ్ చేశారు.
13.01.2024#EAGLE #EAGLEonJan13th pic.twitter.com/D4B6p6LSts
— People Media Factory (@peoplemediafcy) December 13, 2023
కాగా ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో నవదీప్,మధుబాల కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























