బాక్సాఫీస్ వద్ద యానిమల్ హవా.. మరో 2 సినిమాల రికార్డులు బ్రేక్

Animal 12 Days Collections Ranbir Kapoor's Action Film Earns Rs 757.73 Cr Worldwide

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్‌ కపూర్‌, క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘యానిమల్’. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, త్రిప్తి డిమ్రీ ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రణ్‍బీర్‌ కపూర్‌ నటన, సందీప్ వంగా టేకింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయని సాధారణ ప్రేక్షకులతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. దీంతో ‘యానిమల్’ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఉన్న పాత రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. దీంతో యానిమల్ కలెక్షన్లు 12 రోజుల్లో కేవలం ఇండియాలోనే రూ.458.12 కోట్లకు చేరాయి. ఇక తాజాగా బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మరియు సన్నీ డియోల్ నటించిన ‘గదర్ 2’ మూవీలను బీట్ చేసేసింది. ఈ క్రమంలో అత్యంత వేగంగా రూ.450 కోట్ల మార్క్ దాటిన సినిమాగా యానిమల్ నిలిచింది. కాగా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ 18 రోజుల్లో, సన్నీ డియోల్ ‘గదర్ 2’ సినిమాలు 17 రోజుల్లో ఈ మార్క్ దాటాయి. అయితే యానిమల్ మాత్రం కేవలం 12 రోజుల్లోనే దీనిని అధిగమించడం విశేషం. దీంతో రానున్న రెండు, మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ కూడా అందుకోవచ్చని మూవీ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

ఇక డిసెంబర్ 1న రిలీజైన యానిమల్ మూవీ తొలి రోజు ఇండియాలో రూ.63.8 కోట్లు వసూలు చేసింది. దీని తర్వాత రోజురోజుకీ కలెక్షన్స్ పెంచుకుంటూ పోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో రూ.757.73 కోట్లు వసూలు చేసింది. నేడో, రేపో రూ.800 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా.. ప్రేక్షకులు మాత్రం దీనిని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూవీ రిలీజై దాదాపు 2 వారాలు గడుస్తున్నా ఇప్పటికీ అనేకచోట్ల థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద యానిమల్ వసూళ్లు ఇప్పట్లో తగ్గేలా లేవు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =