కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులయ్యారు. అలాగే రోడ్లు, భవనాలు శాఖకు కూడా ఆయన మంత్రిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం వెంకట్ రెడ్డికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం (డిసెంబర్ 7, 2023) రోజున తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సహా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో వారికి నేడు శాఖలు కేటాయిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కళ్యాణ్, అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు యంగ్ హీరో విశ్వక్ సేన్ మరియు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నూతన సీఎం రేవంత్ రెడ్డి మరియు ఆయన మంత్రివర్గ సహచరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: