అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నాగచైతన్య. రీసెంట్ గానే కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో నాగ చైతన్య. ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. యదార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే అర్థమైంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇన్ని రోజులూ ప్రీ ప్రొడక్షన్ పనులతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు మేకర్స్. ఇటీవలే నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన నాగ చైతన్య ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ మాత్రం సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను నేడు గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ అతిథులుగా విచ్చేశారు.
#TFNExclusive: Esteemed guests @venkymama & @iamnagarjuna along with team #Thandel from the movie pooja ceremony!📸✨@Chay_Akkineni @Sai_Pallavi92 @chandoomondeti #AlluAravind #BunnyVas #TeluguFilmNagar pic.twitter.com/PauavuwkrB
— Telugu FilmNagar (@telugufilmnagar) December 9, 2023
కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: