దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా నగరంలో పర్యటిస్తున్న ఆయన వరుసగా పలువురు టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమవుతున్నారు. దీనిలో భాగంగా తొలుత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి వెళ్లిన సరండోస్.. అక్కడ మెగాస్టార్ చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులను కలిశారు. అనంతరం నందమూరి ఫ్యామిలీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కొరటాల శివ కూడా ఆయనతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తారక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. అవి నెట్టింట వైరల్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును కలుసుకున్నారు. మహేష్ ఇంటికి వెళ్లిన ఆయన అక్కడ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కూడా కలిశారు. ఈ సందర్భంగా సంరడోస్ వెంట ఆయన టీమ్ సభ్యులు మోనికా షెర్గిల్, అభిషేక్ గోరాడియాలు ఉన్నారు. కాగా దీనిపై హీరో మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా.. ఒక ఫోటో షేర్ చేశారు. అలాగే, దూరదృష్టి గల టెడ్ సరండోస్ మరియు అతని అద్భుతమైన బృందంతో ఫ్యూచర్ ఎంటర్టైన్మెంట్స్ కు సంబంధించిన కొన్ని విషయాలు కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం అని పేర్కొన్నారు. అయితే టెడ్ సరండోస్ ఇలా టాలీవుడ్ అగ్ర హీరోలతో వరుస భేటీలు అవుతుండటంపై నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. టాలీవుడ్ సినీ స్టార్లతో నెట్‌ఫ్లిక్స్ ఏదైనా మూవీ లేదా సిరీస్ ప్లాన్ చేస్తుందా ?.. అనే సందేహాలు వెలిబుచ్చుతున్నారు.
Coffee and chill!!
Some interesting conversations about the future of entertainment with the visionary #TedSarandos and his fabulous team #MonikaShergill #AbhishekGoradia@NetflixIndia pic.twitter.com/lpoXqMWz05— Mahesh Babu (@urstrulyMahesh) December 9, 2023
ఇక ఇదిలా ఉండగా..మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ‘గుంటూరు కారం’ వస్తోన్న సంగతి తెలిసిందే. హారికా & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నాగవంశీ, హారిక సూర్యదేవర సమర్పిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే యేడాది జనవరి 12న పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: