దసరాతో సమ్మర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నాచురల్ స్టార్ నాని ఈసారి హాయ్ నాన్నతో వస్తున్నాడు.మరో మూడు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.గత కొన్ని రోజుల నుండి నాని ఈసినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నాడు.ఈసినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నాని బలంగా నమ్ముతున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తున్న నాని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఎందుకు పెద్ద డైరెక్టర్స్ తో సినిమా చేయడంలేదని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు నాని.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేను ఇంతవరకు ఏ పెద్ద డైరెక్టర్ ను నాతో సినిమా చేయమని అడుగలేదు.నా కోసం ఎవరైనా కథ రాసుకుంటే ఎలాగైనా ఆ కథే నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తుందని నాని అన్నాడు.ఇక నాని దాదాపుగా కొత్త వారికే అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు.రీసెంట్ గా దసరాతో శ్రీకాంత్ ఓదెలకు ఛాన్స్ ఇవ్వగా ఇప్పుడు హాయ్ నాన్న తో శౌర్యువ్ కు డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు.మరి ఈసినిమాతో నాని మరో హిట్ కొడతాడో లేదో చూడాలి.
బ్యూటిఫుల్ లవ్&ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు.వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలకానుంది అయితే ప్రస్తుతం యానిమల్ మానియా కొనసాగుతున్న నేపథ్యంలో హిందీలో హాయ్ నాన్నకు గట్టి పోటీ ఎదురుకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: