అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈసినిమాను మోస్ట్ వయోలెంట్ గా తెరకెక్కించాడు సందీప్ వంగా. సందీప్ రెడ్డి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈసినిమాలో రణ్‍బీర్ కపూర్ యాక్టింగ్ సినిమాకు ప్రధానమైన హైలైట్‍గా నిలిచింది. ఎమోషనల్, యాక్షన్ ఇలా అన్ని సీన్లలో రణ్‍బీర్ కెరీర్ బెస్ట్ యాక్టింగ్ ను చూపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఈసినిమా ఫస్ట్ డేనే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. రెండో రోజు 236 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 356 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకొని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. మూడు రోజుల్లో ఈసినిమా 6మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
BOX OFFICE TSUNAMI!#AnimalHuntBegins
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani… pic.twitter.com/LIYHpyvEuh
— Animal The Film (@AnimalTheFilm) December 4, 2023
ఇక ఈసినిమా కథ విషయానికి వస్తే రణబీర్ కు చిన్నప్పటి నుండీ తండ్రి అంటే పిచ్చి ప్రేమ. అయితే తండ్రి అనిల్ కపూర్ నుండి మాత్రం ఆశించినంత ప్రేమ లభించదు. కానీ రణబీర్ మాత్రం తండ్రిని అమితంగా ప్రేమిస్తుంటాడు. ఫ్యామిలీ అంటే కూడా ఎంతో ఇష్టముంటుంది. అంతేకాదు ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతుంటాడు. దాంతో అనిల్ కపూర్ కూడా రణబీర్ పై కోప్పడుతుంటాడు. మరోవైపు ప్రేమ పెళ్లి చేసుకొని ఇంటికి దూరమవుతాడు. చాలా కాలం తరువాత మల్లీ ఇంటికి వస్తాడు. అప్పుడే తన తండ్రికి ఆపద ఉందని తెలుసుకుంటాడు. మరి తండ్రి అంటే అమితమైన ప్రేమ ఉన్న ఆపద ఉందని తెలుసుకున్న రణబీర్ ఏం చేశాడు..? తండ్రి కోసం ఎంత దూరం వెళ్లాడు అనేది మిగిలిన కథ..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: