రివ్యూస్ తో సంబంధం లేకుండా యానిమల్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.కబీర్ సింగ్ తరువాత సందీప్ రెడ్డి వంగ ,రన్బీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టుకొని మొదటి స్థానంలో కొనసాగుతుంది.మూడు రోజుల క్రితం విడుదలైన ఈసినిమా మొదటి రోజు కన్నామిగితా రెండు రోజులు ఎక్కువ వసూళ్లను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది.నిర్మాతల లెక్కల ప్రకారం యానిమల్ మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 356కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో దేశ వ్యాప్తంగా 200కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా హిందీలోనే కాదు తెలుగులోకూడా సత్తా చాటుతుంది.తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో దాదాపు 40కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని బ్రేక్ ఈవెన్ ను మార్క్ ను క్రాస్ చేసింది.దాంతో ఫుల్ రన్ లో ఈసినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తీసుకురానుంది.తెలుగులో ఈసినిమాను దిల్ రాజు విడుదలచేశాడు.ఓవరాల్ గా ఇదే ఊపు కొనసాగిస్తే యానిమల్ కు ఫుల్ రన్ లో 1000కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.
తండ్రి కొడుకుల కథ తో తెరకెక్కిన ఈసినిమాలో రష్మిక మందన్న కథానాయకిగా నటించగా అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు.అర్జున్ రెడ్డి తో మేకింగ్ విషయంలో తనదైన ముద్ర వేసిన సందీప్ రెడ్డి ఈయానిమల్ ను మరింత బోల్డ్ గా తీసి సెన్సేషన్ సృష్టించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: