యానిమల్ అప్పుడే లక్ష టికెట్లు సోల్డ్ 

1 lakh tickets sold for animal in advance

ట్రైలర్ తో ఒక్కసారిగా ఎక్కడాలేని బజ్ తెచ్చుకుంది యానిమల్.రణబీర్ కపూర్ హీరోగా నటించగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశాడు.ఈసినిమాకు హిందీలో ఎంత క్రేజ్ వుందో తెలుగులో కూడా అంతే హైప్ వచ్చింది.ఈరోజు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగనుంది.దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబుతోపాటు స్టార్ డైరెక్టర్ రాజమౌళి అతిథిలుగా రానున్నారు దాంతో సినిమాకున్న క్రేజ్ మరింత పెరిగింది.వీరిద్దరు సినిమా గురించి ఏం మాట్లాడుతారని ఆసక్తిగా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమా బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది యానిమల్.బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే పీవీఆర్ ఐనాక్స్,సినీ పోలీస్ వంటి మల్టీ ఫ్లెక్స్ ల్లో లక్షకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. విడుదలకు మరో నాలుగు రోజులు ఉండడంతో అడ్వాన్స్ రూపంలో 4లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడైయ్యేలా వున్నాయ్.

ఇక హిందీలో ఈసినిమా తోలి రోజు సెన్సేషన్ క్రియేట్ చేయనుంది.అక్కడ 40కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.అటు తెలుగులో కూడా ఏ బాలీవుడ్ హీరోకు రాని ఓపెనింగ్స్ ను రానున్నాయి.ఎంతలేదన్నా10కోట్లకు పైగా రాబట్టుకోనుంది.తెలుగులో ఈసినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదలచేస్తున్నాడు.దాంతో అధిక సంఖ్యలో థియేటర్లు దొరుకనున్నాయి.

తండ్రి కొడుకుల మధ్య జరిగే కథతో యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా అనిల్ కపూర్,బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.టి సిరీస్ ఈసినిమాను నిర్మించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =