అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఎన్నో వాయిదాల అనంతరం ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. ఇక ఈసినిమా ట్రైలర్ ను కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ట్రైలర్ కు అయితే సూపర్ రెస్పాన్స్ వస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు సందీప్ వంగా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ ట్రైలర్ పై ప్రభాస్ కూడా తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు. వాట్ ఏ ట్రైలర్.. వాట్ ఏ ఫీల్.. ఎక్స్ ట్రార్డినరీ..మెంటల్.. ఈసినిమా కోసం వెయిట్ చేయలేకపోతున్నా అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇక ప్రభాస్ కామెంట్స్ తో ఈసినిమాపై మరింత బజ్ పెరిగింది. కాగా సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. స్పిరిట్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: