బిగ్ బాస్ 7- శివాజీ సీక్రెట్ టాస్క్.. అమర్-శోభా ఫైటింగ్

bigg boss 7 telugu day 80 highlights

బిగ్ బాస్ 7.. మంగళవారం ఎపిసోడ్ లో మిగిలిన నామినేషన్ ప్రక్రియను బుధవారం ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ చేశాడు బిగ్ బాస్. రెండు రోజులపాటు జరిగిన నామినేషన్ ప్రక్రియ ముగియగా.. ఫైనల్ గా శివాజీ, అర్జున్, రతిక, గౌతమ్, ప్రశాంత్, యావర్, అమర్ దీప్, అశ్విని నానినేషన్స్ లోకి వచ్చారు. ఆ తరువాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం మరోసారి గేమ్ పెడతాడు బిగ్ బాస్. ఈసారి కూడా బ్యా లెన్స్ గేమ్ పెడతాడు. ఇక ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ అందరూ పాల్గొనగా ఫైనల్ గా రైతుబిడ్డ ప్రశాంత్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను గెలుచుకుంటాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రశాంత్ గెలుచుకోగా మంగళవారం ఎపిసోడ్ పూర్తవుతుంది. బుధవారం ఎపిసోడ్ అక్కడి నుండే మొదలవుతుంది. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ మిసెస్ ను ఎవరో చంపేశారని వారిని కనిపెట్టాలని బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు. ఇక ఈ టాస్క్ లో అమర్-అర్జున్ ను ఇంద్రజిత్-కామజిత్ అంటూ ఇన్వెస్టిగేషన్ ఆపీసర్స్ గా నియమించాడు. అశ్విని-శోభాశెట్టిని రిపోర్టర్స్ గా, రతిక-గౌతమ్ సీక్రెట్ ప్రేమ జంటగా.. యావర్-ప్రియాంకలను పనిమనుషులుగా నియమించారు. శివాజీకి సీక్రెట్ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. తాను చెప్పినట్టుగా కంటెస్టెంట్ లను మర్డర్ చేయాల్సి ఉంటుంది.

ఈనేపథ్యంలో ఎవరికి ఇచ్చిన రోల్స్ లో వాళ్లు మెప్పించే ప్రయత్నం చేశారు. సీక్రెట్ టాస్క్ లో భాగంగా శివాజీ ప్రశాంత్ ను స్టోర్ రూమ్ కి పంపిస్తాడు. శివాజీ సీక్రెట్ టాస్క్ గురించి చెప్పకనే చెబుతూ ప్రశాంత్ ను స్టోర్ రూమ్ కి వెళ్లమని చెప్పగా.. ప్రశాంత్ ఎలాంటి ప్రశ్నలు అడగకుండా వెళ్లిపోయాడు. దీంతో ప్రశాంత్ చనిపోయి దెయ్యం అవుతాడు. మరోవైపు టాస్క్ లో భాగంగా శోభా అమర్ మధ్య చిన్న వాదన జరుగుతుంది. శోభా రిపోర్టర్ కాబట్టి అమర్ ను పలు పశ్నలు అడుగుతుంది. ఇక్కడే మైక్ పట్టుకొని పై పైకి వస్తున్నావని.. ఓవర్ ల్యాప్ అవుతుందని అంటాడు అమర్. దీంతో శోభా హర్ట్ అవుతుంది. నవ్వు వస్తుంది దూరంగా వెళ్లు అని అంటున్నాడు అంటూ అమర్ ను అంటుంది శోభా. దాంతోో అమర్ లాఠీ విసిరేసి వెళ్లిపోతాడు. అలా టాస్క్ లో ఎవరికి వారు బిజీగా ఉండగా బుధవారం ఎపిసోడ్ ముగుస్తుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − one =